KDP: సింహాద్రిపురంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మంగళవారం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. బుధవారం విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన


