హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి

SRD: జూకల్ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే వసతిగృహంలో ఐదో తరగతి చదువుతున్న గొల్ల అభిలాష్ అనే విద్యార్థి అనారోగ్యంతో కన్నుమూశాడు. శనివారం అస్వస్థతకు గురికావడంతో ఖేడ్, సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్‌కు చేర్చగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత మృతదేహాన్ని స్వగ్రామమైన బెల్లాపూర్ తరలించారు.