SRCL: వేములవాడలో తిప్పాపూర్ లో ఆదివార నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. పేదలకు వైద్య పరీక్షలు, సలహాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీల ద్వారా వైద్య సహాయం అందిస్తోందని తెలిపారు. ఇలాంటి హెల్త్ క్యాంపులు మరిన్ని నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
ఉచిత మెడికల్ క్యాంపు ను సందర్శించిన ప్రభుత్వ విప్


