హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుదాం: మాజీ ఎమ్మెల్యే

GNTR: ప్రభుత్వ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం తాడేపల్లిలో మాట్లాడుతూ.. గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు. ప్ర‌కాశంలో జన్మించి, లండన్‌లో బారిస్టర్ చదివిన ఆయన.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచారని కొనియాడారు.