హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం స్వామివారికి బంగారు గొలుసు విరాళం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి హైదరాబాద్ మణికొండకు చెందిన శ్రీహరి-రాజేశ్వరి దంపతులు ఆదివారం శ్రీరామ లాకెట్‌తో కూడిన బంగారు గొలుసును విరాళంగా అందించారు. 24 గ్రాముల బరువున్న గొలుసు విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు. దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కానుక సమర్పించారు.