హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం: MLA

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులో త్వరలో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపగా అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌కు వెళ్లాల్సిన ప్రజలకు 75 కిలోమీటర్ల ప్రయాణం తప్పనుంది.