హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో డ్రైవర్ల బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు

KMM: ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సోమవారం నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు సీపీఐ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెట్రోల్ ధరల తగ్గింపు, సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు.