హైదరాబాద్: 28°C
తెలంగాణ

బన్సీలాల్ పెట్ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో బోనాలు

HYD: శ్రావణమాస బోనాల సందర్భంగా సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.