హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిర్నాపల్లిలో సందర్శకులు సందడి

NZB: వర్షాలతో సంస్థాన్ సిర్నాపల్లి వాటర్ ఫాల్ జలకళను సంతరించుకుంది. ఆదివారం సెలవు కావడంతో ప్రకృతి ప్రేమికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబ సభ్యులు, చిన్నారులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకున్నారు. పిల్లలు నీటిలో ఆటలాడుతూ సందడి చేయగా, తల్లిదండ్రులు ఆనందించారు.