హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు బలి

MDK: హవేలిఘనపూర్ మండలంలోని గంగపూర్ తండాలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో తెగిపడిన సర్వీస్ వైర్‌ను సరిచేస్తుండగా విద్యుత్‌ఘాతానికి గురై గోపాల్ (28) అనే యువ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య రజిత, పాప ఉన్నారు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.