హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీపీ చిరంజీవి

SKLM: ఎచ్చెర్ల మండలం రామజోగిపేటలో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఆదివారం ప్రారంభించారు. గత 5 ఏళ్లలో మండల పరిషత్ నుంచి గ్రామాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా గ్రామాల అభివృద్ధికి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.