హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

NLG: ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ.. ప్రమాద, ఆరోగ్య బీమా, స్కాలర్‌ షిప్‌లు, పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. మహాలక్ష్మి పథకం హామీ మేరకు ఏడాదికి రూ.12 వేల జీవన భృతి అందించాలని కోరారు.