హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ

VZM: గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది గాయపడటంతో ఎస్పీ దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీని ఓదార్చి ధైర్యం చెప్పారు.