KDP: చాపాడు మండలం మడూరు కాలువపై లో లెవెల్ వంతెన శిథిలావస్థకు చేరింది. అన్నవరం-ప్రొద్దుటూరు రహదారిపై గోతులు ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రాత్రివేళల్లో గోతులు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిల వంతెనతో వాహనదారులకు ముప్పు


