హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు కురవాలని మంత్రి ప్రత్యేక హోమాలు

SS: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని పెనుకొండలోని స్వగృహంలో మంత్రి సవిత రెండో రోజు ఆదివారం ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. మహా గణపతి సమేత వరుణ యాగం, నవగ్రహ, మృత్యుంజయ, మహా సుదర్శన హోమాలు భక్తిశ్రద్ధలతో చేశారు.రాష్ట్రం సస్యశ్యామలం కావాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు ఆమె వెల్లడించారు.