హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో ఖాళీ సీట్ల భర్తీ

MDK: చేగుంట మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్‌లో 5,6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ వై.సుమతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులకు ఆగస్టు 30,31 తేదీల్లో ఉదయం10 నుండి సాయంత్రం 5 గంటల వరకు టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు తమ కుల,ఆదాయ,బోనఫైడ్ సర్టిఫికెట్లతో పాఠశాలకు రావాలని స్పష్టం చేశారు.