హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్లాట్ మోసం.. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్'

ADB: ఆదిలాబాద్‌లోని SRR టౌన్‌షిప్‌లో ప్లాట్ ఇస్తానని నమ్మించి రూ.5.70 లక్షలు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ కేశవ్‌ను అరెస్ట్ చేసినట్లు CI ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. బాధితుడు నౌసీలాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్లాట్లు కొనేప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.