హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మిక హక్కుల సాధనకు పోరాటమే మార్గం: సీఐటీయూ

SRD: కార్మికుల కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఎస్.రావు స్పష్టం చేశారు. కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక కోడ్‌లను వ్యతిరేకిస్తూ నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.