హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెరువులా మారిన ఎక్స్ రోడ్డు

MDK: టేక్మాల్ ఎక్స్‌రోడ్డులో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో రహదారి చెరువును తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.