VZM: గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మెడికవర్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రప్రసాద్, కానిస్టేబుల్ రాజబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కానిస్టేబుల్ ఎస్.వెంకటరమణ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి


