హైదరాబాద్: 28°C
తెలంగాణ

టిప్పర్ సీజ్.. ఇరువురిపై కేసు

MDK: వెంకటాపూర్ (పిటి) నుంచి తూప్రాన్ పట్టణానికి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై టిప్పర్ యజమాని శ్రీనివాస్ గౌడ్, డ్రైవర్ అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు SI గంగరాజు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.