హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లిలో మహిళా భద్రతపై అవగాహన

KDP: వేంపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ నరసింహులు ఆధ్వర్యంలో శ్రీచైతన్య పాఠశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది. శక్తి యాప్, డయల్‌ 112, సైబర్‌ నేరాలు, బాల్య వివాహాల నివారణ, గృహహింస, రోడ్డు భద్రత తదితర అంశాలపై మహిళలు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు.