హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నాగపూజ

SDPT: సిద్దిపేట కోర్టులో న్యాయవాదిగా సేవలందిస్తున్న ఖమ్మంపల్లి వాసి వరుకోలు నాగపూజను బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగపూజ మాట్లాడుతూ మహిళా హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.