SRCL: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న లోవోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ సమస్యను NPDCL ఏఈ అరవింద్ చారి దృష్టికి తీసుకెళ్లగా,అధికారులు స్పందించారు. ఆదివారం గ్రామంలోని 15 కేవీఏ డీటీఆర్‌ను 25 కేవీఏకు పెంచారు. దీంతో లోవోల్టేజ్ సమస్య తగ్గి విద్యుత్ సరఫరా మెరుగవుతుందన్నరు.
తెలంగాణ
సంకెపల్లిలో లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం


