హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్లాబ్ వేస్తుండగా కూలిన వాటర్ ట్యాంక్

AKP: నక్కపల్లి మండలం పెద బోదిగల్లం వద్ద ఆర్. ఆర్. కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకు కూలిపోయింది. ఆదివారం వాటర్ ట్యాంక్ పైన స్లాబ్ వేస్తుండగా ఒకసారి కూలిపోయింది. కూలిపోయిన మెటీరియల్ కింద ఓ కార్మికుడు చిక్కుకుపోయాడు. అతనిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.