NZB: నగరంలో గత ప్రభుత్వం నిర్మించిన 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి పట్టాలు ఇవ్వడం ద్వారా మంత్రి పొంగులేటి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో 20% కూడా పూర్తికాలేదన్నారు. రెండున్నరేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టించుకోలేదని విమర్శించారు.
తెలంగాణ
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేర్లు మార్చారు: బిగాల


