హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఎస్పీ నేత సుధాకర్‌కు పరామర్శ

MBNR: అనారోగ్యంతో బాధపడుతున్న బీఎస్పీ జడ్చర్ల నియోజకవర్గ ఇంఛార్జ్ సుధాకర్‌ను పార్టీ నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నిర్మాణం, నూతన కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యుడు మొగులయ్య, ఇంఛార్జ్ పండరినాథ్ రాథోడ్, అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.