హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వం విద్యారంగాన్ని మెరుగుపరచాలి'

MDCL: అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 392వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యం కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో బంధీ అయినంతకాలం పేద బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మెరుగుపరచాలని చెప్పుకొచ్చారు.