హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దొంగతనం కేసు ఛేదింపు.. మహిళ అరెస్ట్

GNTR: పొన్నూరులో ఒంటరిగా ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి రత్తయ్య(76)పై దాడి చేసి బంగారం, నగదు చోరీ చేసిన సువర్ణ(52)ను పొన్నూరు అర్బన్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితురాలిని పచ్చలతాడిపర్రు గ్రామంలో గుర్తించి అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గతంలో బాధితుడి పొలంలో సువర్ణ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.