MHBD: కొత్తగూడ మండలం గుండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం వనప్రేమి డాక్టర్ పులుసం సాంబయ్య ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క–ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణతో పాటు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, దేవాలయాల వద్ద పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటి, అమ్మను చూసుకున్నట్టే దానిని సంరక్షించాలన్నారు.
తెలంగాణ
అమ్మ పేరుతో మొక్క.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు


