హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అద్దంకిలో పర్యటించనున్న మంత్రి

BPT: విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తూర్పు గంగవరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించడంతో పాటు, శింగరకొండ టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతుల పనులకు, అద్దంకి ఊరచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.