హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోనెగండ్లలో ప్రతి ఇంటికి తెలుగుదేశం ప్రచారం

KRNL: గోనెగండ్ల పట్టణంలోని 233 నుంచి 238 బూత్‌లలో ‘ప్రతి ఇంటికి తెలుగుదేశం’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.