WGL: సంగెంలో అనారోగ్యంతో మృతి చెందిన కత్తి అనూష కుటుంబానికి దాతలు ఆర్థిక చేయూత అందించారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన దాతలు రూ.55 వేలు, 50 కిలోల బియ్యం అందించారు. ఇందులో రూ.50 వేలను మృతురాలి కుమార్తె హాసిని పేరుతో సంగెం పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. మిగిలిన రూ.5,049ను కుటుంబానికి అందజేశారు. దాతలను పలువురు అభినందించారు.
తెలంగాణ
'బాధిత కుటుంబానికి దాతల చేయూత'


