హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

CTR: జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) ఇవాళ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.