ASF: తిర్యాణి మండలం మంగి గ్రామ పరిధిలో నెట్వర్క్ సౌకర్యం లేక రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్ డీలర్ చిత్రూ ఆదివారం నెట్వర్క్ అందుబాటులో ఉన్న అడవి, కొండ ప్రాంతాలకు వెళ్లి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. గ్రామంలో మొబైల్ సిగ్నల్ లేకపోయినా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా E-KYC నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ నమోదుకు కొండలు ఎక్కాల్సిందే'


