JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాలలో బోడగుట్ట వద్ద గుట్టపై చెట్లు తొలగించి మట్టి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గొర్రెలు,మేకల కాపరులు, రైతులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. గుట్టలపై చెట్లు నరికితే పశువులకు మేత కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా చెట్లు నరికిన వారిని అధికారులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: గుట్టలపై అక్రమార్కుల కన్ను


