హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో చిన్నారి మృతదేహం కలకలం

MDK: సదాశివపేట మండలంలోని ఎనికేపల్లి గ్రామంలో రెండున్నరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలించగా చెరువులో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు మృతి చెందాడా? లేక ఎవరైనా చెరువులో పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.