BHPL: కాటారం సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహాముత్తారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అజ్మీరా రమేష్ ఎన్నికయ్యారు. ఆదివారం కాటారం, మహాముత్తారం, మల్హార్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కాటారం సీఐ నాగార్జునరావు రమేష్‌కు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ
సర్కిల్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్


