హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుని దర్శించుకున్న జేసీ

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ విళ్ళ సూర్యనారాయణ, ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.