హైదరాబాద్: 28°C
క్రీడలు

హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, పడిక్కల్

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ దూకుడుగా కొనసాగుతోంది. గిల్, దేవదత్ పడిక్కల్ అర్ధశతకాలతో క్రీజులో నిలిచారు. గిల్ 50, పడిక్కల్ 62 పరుగులతో రాణిస్తున్నారు. ఇద్దరూ కలిసి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతకుముందు కేఎల్ రాహుల్ 18, యశస్వి జైస్వాల్ 45 పరుగులకు ఔటయ్యారు. 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 186/2 స్కోరుతో పటిష్ఠ స్థితిలో ఉంది.