హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనసేన MLC అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

KMM: ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. శ్రీనివాసరావు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించారు.