హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి ఆర్థిక సహయం

NLG: బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన మొరిగాడి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పదో తరగతి స్నేహితులు ఆదివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. నరేశ్ కుమారుడు శ్రేయన్స్ పేరుపై రూ.1.09 లక్షల పీపీఎఫ్ చేయించారు. అనంతరం సంబంధిత బాండ్ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు.