MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 24న మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మూడ్ రాజు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
వెంకటాపూర్‌లో రేపు మండల స్థాయి ప్రజావాణి


