హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం

NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్రిపహాడ్ రోడ్డులో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రహదారిపై గ్రావెల్, కంకర వేస్తూ పనులు చేపడుతున్నారు. పనులు పూర్తయితే వాహనదారులకు మెరుగైన రాకపోకలు అందనున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.