హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

MBNR: మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న శ్రీ శివాలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.