హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనిగిల్ల గ్రామంలో బోనాల పండుగ

WNP: పెద్దమందడి మండలంలోని మనిగిల్ల గ్రామంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బొడ్రాళ్ల వద్ద నుంచి గిర్నిగడ్డ మీదుగా పోచమ్మ తల్లి బాటలో భక్తులు బోనాలు సమర్పించుకోవాలని గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం పోచమ్మ తల్లి గుడి వద్ద సిమెంట్ బెడ్ పనులను సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గణేష్ పరిశీలించారు.