BHPL: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రమేష్ సూచించారు. ఆదివారం మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు డ్రగ్స్, అక్రమ మద్యానికి దూరంగా ఉండాలని కోరారు.
తెలంగాణ
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SI


