NRML: దిలావర్పూర్ మండలంలోని కదిలి ఆలయాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, పూజారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కదిలి ఆలయంలో అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు


