MDK: నిజాంపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ఇటీవల ఆరుగురిపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిన్నారులు బయటకు వస్తే దాడులకు తెగబడుతుండటంతో తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి, తక్షణమే కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిజాంపేటలో వీధి కుక్కలు హల్చల్


