SKLM: ఒడిస్సా ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహేంద్రతనయ నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పాతపట్నం నుంచి కే.గోపాలపురం, గోపాలపురం గ్రామాలకు వెళ్లే మార్గంలోని కాజ్‌వేపైకి ఆదివారం వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇదే విధంగా కొనసాగితే కాజ్‌వే పూర్తిగా నీట మునిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహేంద్రతనయ నదికి పోటెత్తిన వరద


